సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 10 : తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ అని రజక సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అక్క రాజు శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ మేరకు సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిందన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు.ఈ కార్యక్రమం లో బూరుగు పల్లి మల్లేశం, పూర్మాణి లక్ష్మారెడ్డి, గో డిసెల ఎల్లయ్య, కర్నె బాలయ్య, మోతే మహేష్, తాటిపాముల శ్రీనివాస్, రజక సంఘం సబ్యులు, నేతలు ఉన్నారు.