సిరిసిల్ల రూరల్, మార్చి 16: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్, కేటీఆర్(KCR), జగదీష్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీస్ స్టేషన్లో పార్టీ నేతలతో కలిసి ఎస్ఐ రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమపై కేసులు పెడుతున్న పోలీసులు, కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, బొల్లి రామ్మోహన్, పడి గెల రాజు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బండి జగన్, అంకారపు రవీందర్, కొయ్యడ రమేష్, గుండు ప్రేమ్ కుమార్, కుంటయ్య, రామగౌడ, అఫ్రొజ్, నవీన్ రెడ్డి, జక్కుల నాగరాజు, జగత్, కుర్మా రాజయ్య, ముత్యం రెడ్డి, నవీన్ రావు, కిష్ట రెడ్డి, బాలకృష్ణ, పర్శరాములు పాల్గొన్నారు.