Konaraopeta | మరిమడ్లలో వడగళ్ల వాన బీభత్సం ..చేతికి వచ్చిన వరి పంట నేలపాలు
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
కోనరావుపేట, ఏప్రిల్ 5 : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గాలులతో కూడిన రాళ్లవాన కారణంగా ఎకరాల్లో సాగుచేసిన వరి పంట తీవ్రంగా దెబ్బతీసింది. కోత దశకు చేరుకున్న పంట రాళ్లవాన కురిసి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని గాలి తీవ్రత పెరిగింది. అనంతరం వడగళ్ల వాన కురవడంతో పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా వరి, పంట భారీగా నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు.
కొన్ని చోట్ల పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంట పూర్తిగా పాడైపోయింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఈ ప్రకృతి విపత్తు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నేలపాలు కావడంతో అప్పులపాలు అవ్వడమే తప్ప మరోగతి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ప్రాంతాన్ని సందర్శించి నష్టం అంచనా వేసి ఉన్నతధికారులూకు నివేదించాలని స్థానికులు కోరుతున్నారు.
కరగని రాళ్లు…చెదిరిన ఆశలు
అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో రైతుల ఆశలు చీకట్లోరాళ్లవాన చిదిమేసింది. అయితే విచిత్రం ఏమిటంటే రాళ్లు కురిసి కొన్ని క్షణల్లో కరిగిపోవాల్సిన రాళ్లు ఇప్పటివరకు కరిగిపోలేదు. రాళ్ళన్ని గడ్డలు కుట్టుకపోయి పంట పొలాల్లో పేరుకుపోయాయి.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

