హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తేతెలంగాణ): 80వ స్వాంతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గవర్నర్ నివాసమైన లోక్‌భవన్‌లో శనివారం రాష్ట్ర ఎట్‌హోమ్ నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇచ్చిన తేనేటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.