కోనరావుపేట, ఫిబ్రవరి 20: సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం దవాఖాన చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మనోవేదిన చెందిన భూమయ్య గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు.
మృతుడికి భార్య లచ్చవ్వ, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు.. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.