Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 8 : చిగురుమామిడి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మార్క రాజ్ కుమార్ (కొండాపూర్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గోగూరి లక్ష్మి (సీతారాంపూర్), ప్రధాన కార్యదర్శిగా బోయిని రమేష్ (ము దిమానిక్యం), కార్యదర్శిగా అల్లేపు సంపత్ (రేకొండ), గూళ్ల రజిత (నవాబ్ పేట్), కోశాధికారిగా అలువాల శంకర్ (ఉల్లంపల్లి) ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు రాజకుమార్ మాట్లాడుతూ సర్పంచ్ సమస్యల పరిష్కారం కోసం మంత్రి పొన్నం సహకారంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు.తన నియామకానికి సహకరించిన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు.