Korukanti Chander | పాలకుర్తి : బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల ఇన్చార్జిగా ఎల్కపల్లి మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ ను నియమిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని సూచించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చైతన్య పరుస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండలపార్టీ ఇన్చార్జిగా నియమించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.