Quality education | వీణవంక, జూన్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శోభారాణి అన్నారు. మండలంలోని వీణవంక, కనపర్తి, నర్సింగాపూర్ గ్రామాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ఎంఈవో శోభారాణి సోమవారం బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ వీణవంక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎంపీపీ ఎస్ నర్సింగాపూర్, ఎంపీ యూపీఎస్ కనపర్తి, ఎంపీ యూపీఎస్, వల్బాపూర్ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఎంపీపీ ఎస్ వీణవంక, ఎంపీపీ ఎస్ గర్ల్స్ వీణవంక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.