Kalvasrirampur | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కాల్వశ్రీరాంపూర్ ఎంఈవో మహేశ్
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు.
- పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి
- ఇద్దులాపూర్ పాఠశాలకు రూ.2లక్షల విలువచేసే విద్యా సామగ్రి అందజేత
Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి26 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు. ఇన్ఫినిటీ ఫిన్కార్న్ సొల్యూషన్ సంస్థ పెద్దపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్రాంచ్ సేల్స్ మేనేజర్ నూనే ప్రశాంత్ మండలంలోని ఇద్దులాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రూ.2లక్షల విలు చేసే విద్యా సామగ్రి అందించి, పాఠశాలకు కలర్ వేయించారు. అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు, పలకలు అందించడంతో పాటు, గ్రామంలో తల్లిండ్రుల్ని కోల్పోయిన ఇద్దరు విద్యార్థినులు అక్కల, అక్షిత, అక్షయలకు బట్టలు అదజేశారు.
ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు తనవంతు సహకారంతో సంస్థ తరపున విద్యా సామగ్రి అందించిన ప్రశాంత్ ను పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి అందించాలని కోరారు. ఇదే సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కొనియాడారు. సంస్థ సీఈవో శ్రీకాంత్ రవాల్కర్, హెడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ శంకర్ మాస్లే, ఏరియా మేనేజర్ మానుపాటి భీం రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత, హెచ్ఎం దాస్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశ్, సీఆర్పీ కుమారస్వామి, ఉప సర్పంచ్ హరీశ్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ శారద, ఆయ త్రివేణి, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

