ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.