Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 3 : విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఈనెల 31 వరకు బడి బయటి పిల్లలో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. 14 సంవత్సరాలు లోపు బాల బాలికలు బడిలో చదువుకునేలా చూడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ చందర్ తదితరులు పాల్గొన్నారు.