కాల్వ శ్రీరాంపూర్ మే 8 : అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈవో సిరిమల మహేష్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాంతో కలిసి ఇంటింట తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, గుణాత్మక విద్య, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ల ద్వారా విద్యా బోధనా, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్, ఉచిత వర్క్ బుక్స్, ఉచిత రెండు జతల దుస్తులు, ఉదయం పిల్లల్లకు రాగి జావా, నాణ్యమైన మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అలాగే పదవ తరగతి చదవని మధ్యలో మానివేసిన వారు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఓపెన్ 10వ, ఇంటర్ లో ప్రవేశాల గురించి తెలియజేశారు.