Gangadhara |గంగాధర, మార్చి 28 : క్రైస్తవ నాయకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఏఐటీసీసీ అధ్యక్షులు ప్యాట యాదిప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ మృతి బాధాకరమని, క్రైస్తవ లోకానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. గత మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేక అనుమానాలు దారి తీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి భాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోని పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
పాస్టర్ ప్రవీణ్ సమాజ సేవలో ముందుంటారని, 14 మంది అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్య బుద్ధులు అందజేస్తున్నారని, అనేక నిరుపేద కుటుంబలకు సహాయ సహకారాలు అందజేస్తూ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని, క్రైస్తవుల పై దాడులు జరుగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని రక్షణ కల్పించాలని కోరారు.