PV Jayanti | హుజురాబాద్ టౌన్, జూన్ 28: పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ అధ్వర్యంలో భారత రత్న, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ
జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిఠాయిలు పంచిపెట్టారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి అందించిన అత్యుత్తమ సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ మేధావి మన ప్రాంత వాస్తవ్యుడు కావడం మనందరికి గర్వకారణమని, వారి సేవలను గుర్తించి భారత అత్యుత్తమ పురస్కారం భారతరత్న తో కేంద్ర ప్రభుత్వం వారిని గౌరవించిందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు, ఐఎంఏ డాక్టర్ రామలింగా రెడ్డి, అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బీ మనోజ్, డాక్టర్ తోగరు విద్యాసాగర్, డాక్టర్ ప్రదీప్ రావు, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, పీడీ రాజి రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, కాసర్ల శ్రీహరి, మురికి గౌరీశంకర్, వేల్పుల ప్రభాకర్, ఉమ్మడి రాజమొగిలి, కలకోటి కిషన్ రావు, రావుల తిరుపతి రెడ్డి, సాగి శివ ప్రసాద్ రావు, నమశివాయ, పంజాల సుధాకర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.