Ramagiri | రామగిరి ఏప్రిల్ 05: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తల పెట్టిన ప్రజా ధర్నాను విజవంతం చేయాలనీ సీపీఐ( ఎంఎల్ )న్యూడ్రెమక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకుడు ఆకుల వెంకన్న కోరారు. సెంటీ నరికాలనీ లోని ఐ ఎఫ్ టీయూ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ ను శనివారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంన్న మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసి జాతి హననానికి బీజేపీ ప్రభుత్వాలు హత్యాకాండకు తెగబడుతున్నాయని ఆరోపించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వందలాది మందిని ఎంకౌంటర్ల పేరిట హత్య గావిస్తురని ఈ హత్యకాండను ప్రత్యేకించి ఆదివాసి జాతిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, మేధావులు, ఆలోచనపరులు తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాలన్నారు.
హైదరాబాద్ ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద ఏప్రిల్ 8న నిర్వహించే మహా ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీ రమేష్, రాజనర్సు, జీ లింగయ్య, సంపత్, ఎస్కే ఇమామ్, రాజమౌళి, సదయ్య, ఓదెలు, రాజమౌళి, యాకుబ్, కుమార్, శ్రీనివాస్, రమేష్, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.