Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 1: తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ వేములవాడలో ఆదివారం తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అడుగడుగునా పోలీస్ నిఘా కొనసాగుతోంది.
కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపూర్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి పొందిన అడుగడుగునా పోలీసులు గట్టి నిఘాను పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సివిల్ పోలీసులు అడుగడుగునా నాయకుల ఫోటోలను తీస్తున్నారు.