ASHA workers | గంభీరావు పేట, ఫిబ్రవరి 24 : ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు. పనికి సమానంగా వేతనం ఇవ్వాలని, గత రెండు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మ్యానిఫెస్టో ప్రకారం తమకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, 18 వేల జీతం అందించాలన్నారు. హైద్రాబాద్ లో సోమవారం శాంతి యతంగా ధర్నా చేసిన తమ తోటి ఆశాలను మహిళలు అని చూడకుండా రోడ్డు పై ఈడ్చుకెళ్లారని వారు ప్రభుత్వం పై తీవ్రంగా మండి పడ్డారు.
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన న్యాయమైన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఆశాలు పద్మ, జ్యోతి, లక్కిరెడ్డి అరుణ, లత, స్వరూప, పద్మ, రేణుక, రాణి తదితరులు పాల్గొన్నారు.