ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో జిల్లాలోని నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితి, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
- వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి
- నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో జిల్లాలోని నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితి, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి.. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఎక్కడ కూడా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో నీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,384 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా.. 598 చెరువులు 0-25 శాతం, 965 చెరువులు 25-50 శాతం, 587 చెరువులు 50-75 శాతం, 207 చెరువులు 75-100 శాతం నిండి, మిగులు నీటితో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

