చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప్రయాణికులతో కాళేశ్వరం నుంచి వరంగల్‌కు వెళ్తున్నది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
మహదేపూర్, ఆగస్టు 8: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప్రయాణికులతో కాళేశ్వరం నుంచి వరంగల్‌కు వెళ్తున్నది. మహదేవపూర్ సమీపంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి రహదారి నుంచి పకకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
బస్సు చెట్ల పొదల్లోనే ఆగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా..? లేక డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమా..? అనేది తెలియరాలేదు. ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి పంపే ముందు సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

