Praja Palana | ఇంకుడు గుంతలు నిర్మించుకొని జల సంరక్షణకు తోడ్పడాలి..
Praja Palana | చిగురుమామిడి,మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, ఇందుర్తి, నవాబ్ పేట్ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా గ్రామసభలు గ్రామ సర్పంచ్ ల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
Praja Palana | చిగురుమామిడి, జూన్ 10 : రాబోయే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణ పై ప్రత్యేక దృష్టి వహించాలని ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంఈఓ జయప్రద, సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, ఇందుర్తి, నవాబ్ పేట్ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా గ్రామసభలు గ్రామ సర్పంచ్ ల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణ గ్రామాల్లో సక్రమంగా నిర్వహించాలని, తడి పొడి చెత్త సేకరణ పక్కాగా అమలు చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా వాడుకొని పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలన్నారు. ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకొని జల సంరక్షణకు తోడ్పడాలన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పూర్తి గాని వారు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ గ్రామ సభలలో ఎంపీ ఓ బత్తిని కిరణ్ కుమార్, సర్పంచ్‌లు ఆకవరం భవాని, జంగ శిరీష, చింతపూల నరేందర్, గూళ్ళ రజిత రాజు, పంచాయతీ కార్యదర్శులు కాల్వరమేష్, సంపత్, స్వర్ణలత, సంపత్, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా సుందరగిరి గ్రామ ప్రత్యేక అధికారి తాసిల్దార్ ముద్దసాని రమేష్ గ్రామ సభకు హాజరు కాలేదని, ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదని సర్పంచ్ భర్త సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి తెలిపారు.
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

