Civil Supply | సారంగాపూర్, నవంబర్ 12: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లయ్ డీటీ ఉమాపతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు సెంట్లలోని ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం అలాట్ చేసిన మిల్లులకు తరలించాలని సూచించారు. సెంటర్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేపట్టాలని సూచించారు. రైతుల వారిగా ట్యాబ్లో కొనుగోలు వివరాలను నమోదు చేసి రైతులకు త్వరగా డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయా సెంటర్లను పరిశీలించి కొనుగోలు వివరాలు తెల్సుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ఐ వెకంటేష్, ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.