Chigurumamidi | చిగురుమామిడిలో ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి అధికారులు స్పందించారు.
- ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందన
Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. చిగురు మామిడి మండలంలోని చిగురుమామిడి బొమ్మనపల్లి సుందరగిరి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) బీ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యం నిలువలను వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహలను ఆదేశించారు.
కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి సూచించారు. రైతుల ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండకూడదని సూచించారు. వర్షాలు పడితే రైతుల ధాన్యం తడవకుండా టర్పాలిన్లు సెంటర్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులు ఉండేందుకు నీడ వసతి తో పాటు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాక్టర్లలో తరలించిన ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా మిల్లర్లతో మాట్లాడతారని అన్నారు. వీరి వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రవీందర్, సత్యనారాయణ, సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. చిగురుమామిడి మండలంలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభం కావడం పట్ల రైతులు వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

