కార్పొరేషన్, జనవరి 4: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, మహమూద్ అలీ,
మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనా చారి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.