Dharmapuri | ధర్మపురి, డిసెంబర్ 15 : జగిత్యాల జిల్లాలో మూడోవిడత లో ఎన్నికలు జరుగునున్న ఆరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్. సమయానికి 44గంటల ముందు నుంచే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు ఏవిధమైన ప్రచారాలు నిర్వహించరాదు. అలాగే ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామపంచాయితీ పరిధిలో ఉండకూడదనే నిబంధనలున్నాయి. ఈ సైలెన్స్ పీరియడ్లో లో, ప్రజలు గుంపులుగా చేరరాదని జిల్లా యంత్రాంగం సైతం స్పష్టం చేసింది. కాగా మూడో విడతలో ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి, బుగ్గారం, వెల్లటూర్, ఎండపల్లి, గొల్లపల్లి, పేగడపల్లి మండలాల్లో 119జీపీలకు గాను 6 ఏకగీవ్రం అవగా 113 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1088 వార్డులకు గాను 226 ఏకగీవ్రం కాగా 862 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్ప క్ష పాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు ఆయా మండలాల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లనున్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు వీరే..
గ్రామపంచాయితి ఎన్నికల నేపథ్యంలో దర్మపురి నియోజకవర్గంలో ఆరు గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మపురి మండలం దోమార్ సర్పంచ్ గా దాసరీ పురుషోత్తం, బోదరినక్కలచెరువు గూడెం సర్పంచ్ గా గోపు రాజన్న, నర్సయ్యపల్లి సర్పంచ్ గా పోతంశెట్టి నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెగడపల్లి మండలం రాములపల్లి సర్పంచుగా అమ్మిరికట్టి లక్ష్మీనారాయణ, రాజారంపల్లి సర్పంచిగా ఇస్లావత్ రమేశ్ నాయక్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.వెల్లటూర్ మండలం కొండాపూర్ సర్పంచ్ తాటిపెల్లి రాజవ్వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
113 జీపీలకు ఎన్నికలు.. 453 మంది బరిలో..
119 జీసీలకు గాను 113 జీపీలకు బుధవారం ఎన్నికలు జరుగనుండగా.. 453 మంది బరిలో ఉన్నారు. ఆరు మండలాల పరిధిలో 1088 వార్డు స్థానాలకు 226 ఏకగ్రీవం కాగా 862 స్థానాల్లో 2335 మంది బరిలో ఉన్నారు. ధర్మపురిలో 25 జీపీలకు గాను 3 జీపీలు ఏకగ్రీవం కాగా 22 జీపీలకు ఎన్నికలు జరుగునున్నాయి. పెగడపల్లి మండలంలో 23 జీపీలకు గాను2 రెండు ఏకగ్రీవం కాగా 21 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఎండపెల్లి మండలంలో 15 జీపీలకు గాను 1 జీపీ ఏకగ్రీవం కాగా 14 జీపీలకు ఎన్నికలు జరుగునున్నాయి. బుగ్గారం మండలంలో 10 జీపీలకు, గొల్లపల్లి మండలంలో 27 జీపీలకు, వెల్లటూర్ మండలంలో 19జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ధర్మపురి మండలంలోని 224 వార్డు స్థానాలకు గానూ 65 ఏకగీవ్రం కాగా 159 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుగ్గారం 96 వార్డు స్థానాలకు 13 ఏకగ్రీవం 83 స్థానాలకు, పెగడపల్లి మండలం 216 వార్డుస్థానాలకు గానూ52 ఏకగ్రీవం కాగా 164 స్థానాలకు, గొల్లపల్లి మండలం 246 స్థానాలకు 33 స్థానాలు ఏకగ్రీవం కాగా 213 స్థానాలకు, వెల్లటూర్ మండలం 168 వార్డు స్థానాలకు గాను 38 ఏకగీవ్రం కాగా 130 స్థానాలకు, ఎండపేల్లి మండలం 138 స్థానాలకు గానూ 25 స్థానాలు ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి..
ఆరు మండలాల పరిధిలో 1,75,024 మంది ఓటర్లు
మూడో విడత పంచాయితీ ఎన్నికల్లో ఆరు మండలాల పరిధిలో 1,75,024 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో ఎండపెల్లి మండలంలో 24,077 మంది ఓటర్లు వెల్లటూర్ మండలంలో 22,684 మంది ఓటర్లు, గొల్లవెల్లి మండలంలో 39,658 మంది ఓటర్లు, పెగడపల్లి మండలం 35,869 మంది ఓటర్లు, బుగ్గారం మండలంలో 17,347 మంది ఓటర్లు, ధర్మపురి మండలంలో 35 389 మంది ఓటర్లు మొత్తం 1,75,024 మంది ఓటర్లు ఓటు హక్కును వనియోగించుకోనున్నారు.
ఆరు మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాటు..
మూడో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగనుండగా పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ కోసం ఆయా మండల కేంద్రాల్లో డిస్టిట్యూషన్, రిసెప్షన్ సెంటర్లను సోమవారం అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మూడోవిడత గ్రామపంచాయితీ ఎన్నికలు ఇరిగే ధర్మపురి, బుగ్గారం, ఎండపెల్లి , వెల్లటూర్, పెగడపల్లి, గొల్లపల్లి ఎంపీడీఓలు ఇతర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, పెగడపల్లి మండలంలో ఆదర్శ పాఠశాల, వెల్లటూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో, ఎండపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, గొల్లపెల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించేందుకు టెంట్లు వేసి కౌంటర్లు, ఫర్నీచర్, తాగునీరు, భోజన వసతి, తదిత పాకర్యాలు కల్పించారు. మంగళవారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నుండి సిబ్బంది పోలింగ్ సామాగ్రి తో వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు.