Pre-arrest | జగిత్యాల రూరల్, జూన్ 27 : తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పంచాయతీ కారో బార్ల శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలలో పనిచేస్తున్న కారోబార్ లను రూరల్ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో జగిత్యాల మండలం గ్రామపంచాయతీ కరోబార్ల సంఘం అధ్యక్షుడు వేముల భరణి, జిల్లా నాయకులు ఆకుల కిరణ్, అబ్దుల్లా, సాయి, రోండి శంకర్, వంశీ, గంగాధర్ తో పాటు తదితరులు ఉన్నారు.