కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 10: ప్రజావాణి పునఃప్రారంభమైంది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మళ్లీ ఆర్జీదారులతో సందడిగా కనిపించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత మార్చి 16న షెడ్యూల్ రావడం, ఆ వెంటే కోడ్ కూడా అమల్లోకి తెస్తున్నట్టు సీఈసీ ప్రకటించగా, ప్రజావాణికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. ఎన్నికల నియమావళి కారణంగా సుమారు రెండు నెలల ఇరవై రోజుల పాటు నిలిచిపోయిం ది. ఫలితంగా ప్రజా సమస్యల పరిష్కారం పెం డింగ్‌లో పడింది.
అయితే ఈ నెల 6న కోడ్ ఎత్తివేయడం తో సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో క లెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రజావాణి నిర్వహించారు. జిల్లా ల నలుమూలల నుంచి వందలాది మంది తరలిరాగా, సిరిసిల్లలో కలెక్టర్ అనురాగ్ జయంతి, జగిత్యాలలో కలెక్టర్ యాస్మిన్ భాషా, పెద్దపల్లిలో కలెక్టర్ ముజామ్మిల్ ఖా న్, కరీంనగర్లో అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయ్‌కు అర్జీ లు అందజేశారు. తాము పడుతున్న ఇబ్బందులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై అధికారులకు లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాలు, ఫిర్యాదులు అందించారు. స్పందించి న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సత్వరమే పరిష్కారమార్గాలు చూపాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.