ధర్మారం, అక్టోబర్ 20: ‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇ ప్పు డు అబద్ధాల ఆరు గ్యారెంటీలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నది’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పు ల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పా లనలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని దొంగతుర్తి, నర్సింహులపల్లి, బుచ్చయ్యపలి,్ల బొట్లనపర్తి గ్రామాల్లో ప్రజాఆశీర్వాదయాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు బతుకమ్మలు, బో నాలతో స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి గడపగడపకూ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఆయాచోట్ల మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదేందుకని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం ఇస్తే వెలగబెడతామని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ మాటలను ప్రజలను విశ్వసించబోరన్నారు. గ్రామాలకు వచ్చి ఆపదమొక్కులు మొక్కుతున్నారని ఆక్షేపించారు. వారి మాటలను నమ్మి ఆగం కావద్దని, సీఎం కేసీఆర్ సారథ్యంలో బొమ్మరిల్లులా తయారైన తెలంగాణను చిన్నాభిన్నం చేసుకోవద్దని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 200 పింఛన్‌ను 2000లు చేసిన, సాగుకు 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాళేశ్వరం నిర్మించి సాగునీరు అందుబాటులోకి తేవడంతో ఇక్కడి రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని చెప్పారు.
ఇదేస్ఫూర్తితో కేసీఆర్ మరింత జనరంజకంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రూపొందిచారన్నారు. తాను 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎలాంటి ఆరోపణలు లేకుండా సేవలందిస్తున్నానని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 32 వేల మందికి 82 కోట్ల విలువైన సాయం చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచామని, దొంగతుర్తిలో 8 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కాగా దొంగతుర్తికి చెందిన గొట్లె అక్షయ (12) అనే బాలిక క్యాన్సర్ చికిత్సకు కొప్పుల 4 లక్షల ఎల్వోసీ మం జూరు చేయించారు. ప్రస్తుతం ఆమె కొలుకున్నదని తల్లిదండ్రులు లక్ష్మీ-నారాయణ మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే జుంజుపల్లి లక్ష్మి, జుంజిపల్లి సునీత, జుంజిపల్లి విజ య, జుంజుపల్లి సత్తవ్వ కలిసి మంత్రి ఈశ్వర్‌కు వెయ్యి చొప్పున ప్రచార ఖర్చుల కోసం మం త్రి ఈశ్వర్‌కు అందజేసి అభిమానాన్ని చాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, సర్పంచులు అడువాల అరుణ జ్యోతి, ఇమ్మడిశెట్టి కొమురయ్య, రెడపాక ప్రమీల, ఎంపీటీసీలు దాడి సదయ్య, మోతె సుజాత, దొంగతుర్తి ఉప సర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు, విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, నాయకులు బాలసాని లింగయ్య, ఇమ్మడిశెట్టి రవీందర్, గాండ్ల నర్సయ్య, కల్లెపల్లి లింగయ్య పాల్గొన్నారు.