Pegadapalli | పెగడపల్లి: ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు శనివారం పాలాభిషేకం చేశారు. కాగా అంబేద్కర్ కూడలిలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్ర పాటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సుర కంటి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగల శ్రీనివాస్, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్, సందీ మల్లారెడ్డి, బండారి శ్రీనివాస్, పురుషోత్తం అనిల్ గౌడ్, మండల నాయకులు కడారి తిరుపతి, పూసల తిరుపతి, సింగసాని స్వామి, మండల బీసీ సంఘం అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్, వడ్లూరి ప్రవీణ్ కుమార్, మందపల్లి అంజయ్య, లింగంపల్లి మహేష్, దీకొండ మహేందర్, శ్రీరామ్ అంజయ్య, కృష్ణ హరి బొడ్డు రమేష్ పటేల్, సత్యనారాయణ రెడ్డి, సుంకరి రవి, మాడిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.