Political training | తిమ్మాపూర్, అక్టోబర్ 22: ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే యాదవ కులస్తులకు మానకొండూరు మండలం ఖాదర్ గూడెం లోని ఫామ్ అరవింద ఫామ్ హౌస్ లో రాజకీయ శిక్షణ శిబిరాన్ని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాని కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు.
మండలంలోని రామకృష్ణ కాలనీలో యాదవ సంఘం భవనంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 24న శుక్రవారం ఉదయం 10 గంటలకు తరగతులు ప్రారంభం అవుతాయని ఆశవాహ అభ్యర్థులు పాల్గొని ఎన్నికల్లో గెలిచేందుకు సమయత్తం కావాలన్నారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంద వేణి ప్రసాద్ యాదవ్, బాబుర్ కుమార్, జంగా శ్రీనివాస్, తమనబోయిన నరసయ్య, పోలం అంజయ్య, ఆవుల అంజయ్య, హనుమంతు, వేల్పుల ఓదెలు, వేల్పుల భూపతి, గోపాల్, పొలం మల్లేష్, పొలం రాజయ్య, ఆవుల రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.