KTR | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిలో జిల్లా చెక్ పోస్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు.
సిరిసిల్ల పట్టణానికి పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వాహనాన్నీ ఆపి తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకి కేటీఆర్ పూర్తిగా సహకరించారు.