Pochamma Thalli Utsavalu | హుజురాబాద్, అక్టోబర్ 7: హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేట గ్రామంలో పోచమ్మ తల్లి ఉత్సవాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి, నాభి శిల, భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ నలు వీధులలో పోచమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. ఆలయ కమిటీ సభ్యులు పోచమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసారు.
పోతిరెడ్డి పేట పోచమ్మ తల్లి భక్తుల యొక్క మొరను ఆలకించి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా తెలంగాణలోనే పేరుగాంచినందున పట్నం నుండి పల్లె వరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపేట పోచమ్మ తల్లి గ్రామ ప్రజలందరితోపాటు ఆ తల్లిని అనునిత్యం దర్శించుకునే భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించునట్లు ఎల్లవేళలా ఆ తల్లి తమ దీవెనలను అందించాలని వేడుకొన్నారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలందరూ ఇంతకు రెట్టింపైన ఉత్సాహంతో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ గ్రామానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, సందేల వెంకన్న, జూపాక కృష్ణమూర్తి, చందుపట్ల రాజేందర్, మామిడి రమేష్, చొల్లేటి హరికిషన్, వెన్నంపల్లి నాగరాజు, బొల్లవేణి శంకర్, మంతెన సురేందర్, మంద సదాశివరెడ్డి, చెన్నోజు భద్రయ్య, తాటికొండ సదానందం, వెన్నంపల్లి శ్రీనివాస, ఎలుక పల్లి మనీ జూపాక రామన్నతోపాటు గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ