Pochamma Bonalu | తిమ్మాపూర్, జూన్14 : కరీంనగర్ కార్పొరేషన్ లోని 8 వ డివిజన్ అలుగునూర్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉప వాస దీక్షితో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివ సత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మ వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు కంది లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
రెండేళ్లకోసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కంది లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు జాప రాఘవరెడ్డి, ఎర్రము అనంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడిపాటి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి మామిడి సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి జాప లక్ష్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడు కంది రామచంద్రారెడ్డి, ముఖ్య సలహాదారులు జాప వెంకట మల్లారెడ్డి, పాకాల మల్లారెడ్డి, కంది రాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు జాప రవీందర్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి, జాప నాగరాజు, కంది శ్యాంసుందర్ రెడ్డి, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, గోపు సురేందర్ రెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి, గోపు మల్లారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.