PM Shri scheme | పీఎం శ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.. జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్
పీఎంశ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
PM Shri scheme | కోరుట్ల, ఫిబ్రవరి 19 : పీఎంశ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ నిధులు రూ.40.50 లక్షలతో చేపడుతున్న అదనపు తరగతి గదులు, అధునాతన సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణ పనుల్లో అలసత్వం పనికిరాదని, నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, జిల్లా విద్యాధికారి రాము, మండల విద్యాధికారి గంగుల నరేశం, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ, టీఎస్ డబ్ల్యూడీఈ ఇంజనీర్లు శశికుమార్, ధనుంజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

