Seasonal diseases | జగిత్యాల రూరల్ జూన్ 20 : సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు నెలల పాటు పారిశుద్ధ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ పారిశుద్ధ కమిటీలలో వైద్య శాఖ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఆశ వర్కర్ల దగ్గర అన్ని రకాల మందులు జ్వరం, దగ్గు సీజనల్ వ్యాధులకు సంబంధించిన ప్రజలకు అవసరమైన మందులు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రణ కొరకు గ్రామాల్లో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో RMO లు సీజనల్ వ్యాధులకు వైద్యం పట్ల సమావేశాలు నిర్వహించాలన్నారు. వైద్యశాఖ అధికారులు స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో అధిక కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.