Person Missing | ముత్తారం, మే 29 : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి కనుబడుట లేదు. ఎల్లయ్య వృత్తి రిత్యా గీతకార్మికుడు కాగా ఈ నెల 26న కల్లు గీసెందుకు వెళ్తానని చెప్పి ఇంట్లోకెళ్లి వెళ్లాడు.
సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో బంధువుల ఇండ్లల్లో ఆచూకీ కోసం వెతికినా ఎలాంటి ఫలితం లేదు. కాగా ఎల్లయ్య కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.