ఉత్తమ పనితీరుతో చిరస్థాయి గుర్తింపు
అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
- సీపీ సత్యనారాయణ సమర్థవంతంగా పనిచేశారు
- మంత్రి గంగుల కమలాకర్
- సత్యనారాయణకు వీడ్కోలు, సుబ్బారాయుడికి స్వాగత కార్యక్రమం
రాంనగర్, జనవరి 27: అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాచకొండ జాయింట్ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న సీపీ వీ సత్యనారాయణకు వీడోలు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీపీ ఎల్ సుబ్బారాయుడుకు స్వాగతం పలుకుతూ శుక్రవారం కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. సీపీ సత్యనారాయణ జిల్లాలో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. రాజన్న జోన్ డీఐజీ కే రమేశ్ నాయుడు మాట్లాడుతూ, మానవత్వంతో స్పందిస్తూ సేవలందించే అధికారిగా సీపీ సత్యనారాయణ గుర్తింపు పొందారన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, సాహసోపేతమైన చర్యలతో కమిషనరేట్ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. సంతృప్తికరంగా విధులను నిర్వహించానని, సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, తనకు సుపరిచిత ప్రాంతమే అయినందున ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. బదిలీపై వెళ్తున్న సీపీకి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధశాఖలకు చెందిన అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్తోపాటు డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, మదన్లాల్, జే విజయసారథి, కే శ్రీనివాస్, సీ ప్రతాప్, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

