Collector Satya Prasad | రాయికల్, జూన్ 6 : భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రాయికల్ మండలం దావన్ పల్లి, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆయన వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.