Cyber crimes | పెగడపల్లి : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ సెల్ ఫోన్ లో వచ్చే అనవసరమైన లింకులను ఓపెన్ చేయొద్దని, అలాగే బ్యాంక్ అధికారులు అని చెప్పి ఫోన్ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు. ఎవరైనా అనుకోకుండా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్సై కిరణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.