Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, ఆగస్టు 29 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
మానేరు వాగు, హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంత రైతులు, పశువుల కాపరులు వాగులు ఉదృతంగా ప్రవహించినప్పుడు అటువైపు వెళ్లొద్దని సూచించారు . రహదారి వెంట లో లెవెల్ కల్వర్టు పై నుండి వరద నీరు వెళ్లిన సమయంలో వాహనదారులు కల్వర్టు పై నుండి రావద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని మండల ప్రజలను చెప్పారు.