Vyalla Harish Reddy | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామా.. అని ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అరాచకపు పాలన చరమగీతం పాడేందుకు సన్నద్ధులై ఉన్నారని రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శనివారం జరిగిన కార్యక్రమంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను హరీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై బలంగా పోరాడుతున్న బీఆర్ఎస్ లోకి నీలం భిక్షపతి తదితరులు వ్యాల్ల హరీష్ రెడ్డి సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను మానసికంగా వేధిస్తూ షాపులు ఇండ్లు కూల్చివేస్తూ అరాచక పాలన సాగి స్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం అధికారులు చెల్లించుకుంటారని, ఇప్పటికే రామగుండం ప్రజలు బీఆర్ఎస్ వైపు, రాష్ట్రంలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. రామగుండంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్లో ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడేందుకు ప్రజలు సహకరించి కలిసి రావాలని కోరారు. ఇకనుండి రామగుండంలో ఎలాంటి ఆపద వచ్చినా, ఏ చిన్న షెడ్డును అభివృద్ధి పేరిట కూల్చివేతకు అధికారులు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తీసుకువచ్చిన నోటీసు ఇవ్వకుండా ఇబ్బంది చేయాలని చూస్తే ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు తప్పకుండా అండగా ఉంటూ న్యాయపరంగా పోరాడేందుకు ముందుంటానని హరీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎక్కడ ఉన్న చిరు వ్యాపారులు సింగరేణి స్థలాల్లో నిర్ణయించుకున్నా ఇండ్లు దుకాణాలను తొలగించే అధికారం సింగరేణి కి, మున్సిపల్ అధికారులకు కూడా లేదని అన్నారు. కార్మికులు ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా భూమి పొరల్లోకి వెళ్లి రక్తాన్ని చిందిస్తూ వెనుకాడకుండా దేశానికి వెలుగులు పంచుతున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జహీద్ పాషా, మాజీ కార్పొరేటర్లు ఎన్వీ రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, మెరుగు చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళ ఉద్యమకారిణి పర్శ స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, శ్రీ హరి, బోట్ల పోషం, నీలం భిక్షపతి, నడిపల్లి సాయి, ఎండీ అతహరుద్దీన్, రహమాన్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్, యువరాజ్ నేత, ఉదయ్, శ్రీనివాస్ రావు, బొడ్డుపల్లి రాజు, మోబిన్, కొండ సురేష్, పోయిల రవి, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.