Godavarikhani | బాబు జగ్జీవన్ రామ్ ను స్మరించుకున్న గోదావరిఖని బస్తి ప్రజలు
స్వాతంత్ర్య సమరయోధులు, భారత దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జాతికి అందించిన సేవలను గోదావరిఖని లోని 11వ డివిజన్ బస్తీ ప్రజలు స్మరించుకున్నారు.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 5 : స్వాతంత్ర్య సమరయోధులు, భారత దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జాతికి అందించిన సేవలను గోదావరిఖని లోని 11వ డివిజన్ బస్తీ ప్రజలు స్మరించుకున్నారు. ఈ మేరకు 11వ డివిజన్ సంజయ్ నగర్ బస్తీ పెద్దలు బూడిద రమేష్, మారపల్లి రవి కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా 11వ డివిజన్ ఐక్య వేదిక అధ్యక్షుడు లంక సురేష్ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖలకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించి, స్వాతంత్రం అనంతరం స్వయంపాలనలో దేశ ప్రగతికోసం ఆయన తన వంతు కృషి చేశారని కేసీఆర్ వెల్లడించారు.
అందరూ చదువులో ఎదగాలి, అందరూ చదువుకోవాలని కోరుకునే ఎంతో మందికి తోడ్పాటు అందించే వ్యక్తిగా మన జాతిలో ఉండడం గర్వకరణం అని కొనియాడారు. కార్యక్రమంలో బస్తీ పెద్దలు జీడి కుమార్, లంక సదానందం, మాతంగి కనకరాజు, గడ్డం రమేష్, గంగారపు మల్లయ్య, అడ్డూరు రాములు, ప్రకాష్, ఓదెలు బస్తి పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

