Singareni | గోదావరిఖని : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఖాయిలా శాఖ కార్యదర్శి సీఎంపీఎఫ్వో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ విక్రమ్ దేవ్ దత్ కు శనివారం లేఖ రాశారు.
1989లో తన వెంకటస్వామి ప్రవేశపెట్టిన పింఛన్ పథకం ఇప్పటివరకు సవరించకపోవడం వల్ల పదవీ విరమణ కార్మికులు నెలకు సగటుగా ₹1,500 మాత్రమే పొందుతున్నారని, ఇది నేటి జీవన ఖర్చులకు తగినంత కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు సమీక్ష నిర్వహించి సింగరేణి కార్మికులకు తగిన న్యాయం చేకూర్చాలని ఎంపీ వంశీ కోరారు.