ముత్తారం, జూన్17: ‘నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాగులపై వంతెనలు కట్టలేదేందుకు? సాగునీటి ప్రాజెక్టులు నిర్మించలేదేందుకు? సాగుకు సరిపడా కరెంట్ ఇవ్వలేదేందుకు? అర్హులందరికీ పింఛన్లు ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్దే మళ్లీ అధికారమని ధీమావ్యక్తం చేశారు. ‘తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ఎదురులేదు..రాష్ట్రంలో బీఆర్ఎస్కు తిరుగులేదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్దీదే గెలుపని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి శివారులోని మానేరుపై రూ. 50 కోట్లతో నిర్మించిన వంతెనను శనివారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షినితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో తనదైన శైలిలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని ఏకరువు పెడుతూనే..ప్రతిపక్షాల వైఖరిని తూర్పారాబట్టారు.
తొమ్మిదేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. చిత్తశుద్ధితో చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతితోనే మన పల్లెలకు జాతీయ అవార్డులు దక్కాయని పేర్కొన్నారు. రైతులకు సాగు పెట్టుబడికి సాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంథనిలో పుట్ట మధు ఎ మ్మెల్యేగా గెలిచాకనే అభివృద్ధి జరిగిందని చెప్పా రు. ఆయన సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నియోజకవర్గానికి విరివిగా నిధులు తీసుకువచ్చారని చెప్పా రు. తాను తన నియోజకవర్గంలో నిర్మించలేని బ్రి డ్జిలను ఆయన నిర్మించారని పేర్కొన్నారు. ఆయన ఎంత కష్టపడితే ఖమ్మంపల్లి బ్రిడ్జి పూర్తయిందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. మంథనిలో పుట్ట మధూకర్ నేతృత్వంలో గులాబీ జెం డా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు.
‘ప్రజలకు అబద్ధాలు చెబితే అధికారం వస్తుందని కాంగ్రెస్ నాయకులు భ్రమిస్తున్నారు..వారి కలలు కల్లలు కావడం ఖాయం’ అని జోస్యం చె ప్పారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైజల, ఎంపీపీ జక్కుల ము త్తయ్య, జడ్పీటీసీ చెలకల స్వర్ణలతాఅశోక్ యాద వ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ అత్తె చంద్రమౌళి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు రాగుల సతీశ్, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, ఎం పీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అల్లం తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్లు ఇల్లందుల అశోక్‌గౌడ్, బేద సం పత్, ఓడ్నాల రాజు, మంథని ఎంపీపీ కొండ శం కర్, రామగిరి ఎంపీపీ ఆరేళ్లి జడ్పీటీసీ సుమలత, మల్హార్ మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు, ముత్తారం మాజీ జడ్పీటీసీ మైదం భారతీవరప్రసాద్, నాయకులు చల్ల నారాయణరెడ్డి, జక్కుల సదయ్యగౌడ్, బండారి సుధాకర్, దుర్గయ్య, ఆకుల కిరణ్, పుల్లెల కిరణ్ పాల్గొన్నారు.
అన్నంపెట్టిన నేతకు అన్యాయం చేయద్దు
సీఎం కేసీఆర్ కృషితోనే అన్ని గ్రామాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. మంథనిలో 75 ఏండ్లు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని పుట్ట మధు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేసి చూపించారు. సీఎం కేసీఆర్ సహకారంతో పుట్ట మధు ఖమ్మంపల్లి వంతెనను నిర్మించండం గొప్ప విషయం. మంథని నియోజకవర్గంలో 23 బ్రిడ్జిలను నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. ‘అన్నంపెట్టే నాయకుడికి అన్యాయం చేయవద్దు. ప్రజలు ఆలోచించి ఆదరించాలి.
– పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని
బీఆర్ఎస్కే ఓటడిగే హక్కు
మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ఇక్కడి ప్రజలకు ఓటడిగే హక్కు ఉన్నది. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి కర్ణాటకలో గెలిచింది. ఆ పార్టీ ఆటలు తెలంగాణలో సాగవు. హైదరాబాద్‌లో ఉంటూ చుట్టపుచూపుగా వస్తు న్న మంథని ఎమ్మెల్యేను ప్రజలు తరిమికొట్టాలి. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్న ఆయన మనకు అవసరమా..? నే ను మంథనిలో పుట్టిన మట్టి బిడ్డను. నాలుగు ఏండ్లు అధికారం ఇస్తేనే 40 ఏండ్లలో చేయలేని అభివృద్ధ్ది చేశా. ఈ సారి అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. కష్టపడి ఖమ్మంపల్లి మానేరుపై వంతెన నిర్మాణం కోసం నిధులు తీసుకొచ్చా. భూపాపల్లి, పెద్దపల్లి జిల్లాను కలుపుతూ 50 కోట్లతో నిర్మించిన ఈ వంతెనతో రెండు జిల్లాల ప్రజలు 20 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్