గోదావరిఖని : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై సింగరేణిలో కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలు ‘ఐక్యవేదికగా’ ఏర్పడి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీడీకే 2 ఇంక్లైన్ గనికి వచ్చిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీజీబీకేస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్ ఉపాధ్యక్షులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రంగు శ్రీనివాస్ ఏఐటీయూసీ, గుండేటి శ్రీనివాస్ ఐన్టీయూసీ ,మెండే శ్రీను సీఐటీయూ, శేషగిరి టీబీజేకేఎస్, కార్మికులకు నల్ల బ్యాడ్జిలు పెట్టి నాలుగు లేబర్ కోడ్స్ పత్రాలను తగలబెట్టారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసి బడా పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని మండిపడ్డారు. వెంటనే దీనిని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, కార్మిక సంఘాలు కార్మిక వర్గాన్ని ఒకే తాటిపై నడిపించాలన్నారు. వెంటనే ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను నిలిపివేయాలని, లేదంటే కార్మికుల కోపానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి, పొన్నాల వెంకటయ్య ఏఐటీయూసీ, సిరిపురం నరసయ్య ఐ ఎన్ టి యు సి, అనవేని శంకర్ సిఐటియు సిఐటియు, మీసరాజు, దేవేందర్, భాస్కర్, టిప్పు, రాజు, ప్రసాద్, ప్రవీణ్, ప్రదీప్, మధు, తదితరులు పాల్గొన్నారు.