Tractor cage wheels | అంతర్గాం, జూన్ 26 : అంతర్గాం మండల పరిధిలో ట్రాక్టర్ యజమానులు కేజ్ వీల్స్ రోడ్లపైకి తీసుకురాకూడదని అంతర్గాం మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ సూచించారు. గురువారం అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని ట్రాక్టర్ల యజమానులతో, ట్రాక్టర్ల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు రోడ్డు ఉపరితలాలకు జరిగే నష్టం, ప్రజా భద్రతకు కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజా రహదారులపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ వాడకం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది తెలిపారు. ట్రాక్టర్ కేజ్ వీల్స్ పదునైన ప్రొజెక్షన్లు రోడ్డుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు.
పెద్దపల్లి జిల్లాలో రోడ్డపై కేజ్ వీల్స్ వాడటం పూర్తిగా నిషేధించబడిందని ఎవరైనా ట్రాక్టర్ యజమానులు కేజ్ వీల్స్ రోడ్లపైకి తీసుకువస్తే జిల్లా కలెక్టర్ అదేశానుసారం మొదటిసారి రూ.5,000/-, రెండవసారి రూ. 10,000, మూడవసారి రూ.20,000 జరిమానా విధిస్తామని, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడుతుందన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి