ఓదెల, జులై 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూక్ పూర్వ విద్యార్థి వాటర్ కూలర్ ను బుధవారం అందజేశారు. పొత్కపల్లిలో 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థి అయినా రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన గాజేంగి శ్రీనివాస్ పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం వాటర్ కూలర్ ను సొంత డబ్బులతో కొనుగోలు చేసి బుధవారం పాఠశాలకు అందజేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన చల్లటి మినరల్ వాటర్ తాగే సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో వాటర్ కూలర్ ను పాఠశాలకు అందజేసినట్లు చెప్పారు.
వర్షాకాలం దృష్ట్యా విద్యార్థులు దిగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వాటర్ కూలర్ ను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో రూప నారాయణపేట సర్పంచ్ బొంగోని రమ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రవి, ప్రధానోపాధ్యాయులు ఎబూసి శ్రీనివాస్, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.