Smart Ration Card : రాష్ట్ర ప్రభుత్వం (State Govt) జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్‌పై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి (Civil Supplies Minister) ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పందించారు. సన్న బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం (Union Govt) పూర్తిస్థాయిలో నిధులు సమకూరిస్తేనే కార్డులపై ప్రధాని ఫొటోను ముద్రించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన స్పష్టంచేశారు.
పేదల ఆకలి తీర్చే ఈ పథకం విషయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆయన హితవుపలికారు. సూర్యాపేటలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు రూ.14.9 కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు. కొందరు తగినంత ఆర్థిక సహకారం అందించకుండానే రేషన్ బియ్యం పంపిణీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపట్ల ఉన్న గౌరవంతో, ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటోను ప్రదర్శిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చిత్రాలను కార్డులపై ముద్రించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు.