Suriya | బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
Vishwanath And Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
Venky Atluri | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డును సృష్టించింది.
ఈ చిత్రంలో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్య సృష్టించిన ఈ సునామీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల వద్ద ‘బ్లాక్‌బస్టర్ విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు కొనసాగుతుండటంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. త్వరలోనే ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
#VishwanathAndSons hits it out of the park and smashes a 100cr+ in just 2 days 💥💥#BlockbusterVAS running successfully in cinemas near you ❤️#BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/fhIpLYvFJb
— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

