జూలపల్లి : ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమీటి సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, శంకరన్నకు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్లో ఆదివారం గ్రామస్తులు ఆత్మీయంగా గజమాలతో సన్మానం చేశారు. ఆయన దాదాపు 45 ఏండ్ల తర్వాత అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రసాద్ రావు తన సొంతింటికి వెళ్లి మురిసి పోయారు.
తాను చదువుకున్న బడిలో అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. చిన్ననాటి మిత్రులు, బంధువులను కలిశారు. గ్రామస్తులను ఆత్మీయంగా పలకరిస్తూ మంచి చెడులు తెల్లుకున్నారు. కార్యక్రమంలో పుల్లూరి ప్రశాంతి, ఏఎంసీ మాజీ చైర్మన్ కంది చొక్కా రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, నాయకులు మాంకాలి తిరుపతి, మొగురం రాజేశం, ఎర్రోళ్ల రాములు, అడప లక్ష్మణ్, ఆకుల రాజయ్య, చెన్నమనేని విద్యాసాగర్ రావు, కంది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.