బాల సుమన్‌పై కేసుల వివరాలివ్వండి
మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బాల్క సుమన్‌పై చెన్నూరులో నమోదైన కేసుతో పాటు శేరిలింగంపల్లిలో నమోదైన మరో కేసు వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
- ఫిర్యాదుదారులకూ నోటీసులు
- విచారణ 17కు వాయిదా
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బాల్క సుమన్‌పై చెన్నూరులో నమోదైన కేసుతో పాటు శేరిలింగంపల్లిలో నమోదైన మరో కేసు వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీసులతోపాటు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. చెన్నూరు ము న్సిపల్ ఎన్నికల సమయంలో సుమన్ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చే సి, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ న మోదు చేశారు. దీనితోపాటు రాయదుర్గంలోని ఒక విల్లాలో ప్రభుత్వానికి, ఎక్సైజ్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు నిరుడు తనపై నమోదైన మరో కేసును కొట్టేయాలని ఆయన హై కోర్టులో విడివిడిగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన జ స్టిస్ కే సుజన.. ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారు. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం ఏమైంది ? ; రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధుల నుంచి నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీ నిపై వివరణ ఇవ్వడంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశి స్తూ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్‌కు చెందిన రామగిరి నందయ్య సహా 21మంది వేసిన వ్యాజ్యాలపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది డీ అంబేదర్ వాదిస్తూ.. నిర్వాసితులకు రూ.58 కోట్ల పరిహారం చెల్లింపు నిమిత్తం 2011లో ప్రభుత్వం జీవో జారీ చేసినా ఆ మొత్తాన్ని చెల్లించలేదని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి పరిహారం చెల్లించకపోవడం, 2023లో తీసుకొచ్చిన జీవో 320 కింద పరిహారం చెల్లిస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. నిర్వాసితులకు వడ్డీతో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

